సమాజ సేవా కవుల ధ్యేయం కావాలి


Sun,March 17, 2019 12:01 AM

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ : సమాజ సేవా కవుల ధ్యేయం కావాలని భారత్‌భూషణ్ డాక్టర్ తిరునగరి అన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధార్మిక, సాహిత్య సంగీత సభల్లో భాగంగా శనివారం నిర్వహించిన కవి సమ్మేళననానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కవులు తమ కవిత్వాన్ని కొనసాగించే క్రమంలో సమాజ సేవపై కూడా దృష్టిసారించాలన్నారు. నాటి నుంచి చూస్తే ఆంధ్రా సాహిత్యం కన్నా తెలంగాణ సాహిత్యం గొప్పగా వర్ధిల్లుతున్నదన్నారు. ప్రజల ఆధరణ తెలంగాణ కవిత్వానికి అధికంగా ఉన్నదన్నారు. ప్రజల శ్రమను గుర్తించి వారిలో ఉత్సాహం తీసుకురావడం కోసం ఎన్నో కవిత్వాలు కవులనుంచి వచ్చాయన్నారు. ఆధునిక తెలంగాణ కవిత్వం ఎంతో ఆదర్శంగా ఉన్నదన్నారు. యాదాద్రిలో ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కవి సమ్మేళనం నిర్వహించడం అద్భుతమన్నారు.

నాడు దివాకర్ల వెంకటావధాని మొదలైన ఉద్దండ పండితులు పాల్గొన్న కవిసమ్మేళనం నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మూడు దశాబ్దాలుగా సాహితీ రంగంలో సేవలు అందిస్తున్న జంటకవులు రాగిసహదేవ్, చెన్నోజు ఉప్పలాచారిలను అభినందించారు. అదేవిధంగా శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఏఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న మేడి శివకుమార్ సాహిత్యంపై మక్కువతో ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారన్నారు. ప్రముఖ కవి రాగిసహదేవ్ తన కవిత్వంలో హిణ్యకశిపుడు ఒక్కడే చచ్చాడు... ఇంకెందరో హిరణ్యకశిపులు బతికే ఉన్నారనే కవిత ఎంతగానో ఆకట్టుకుంది. యాదాద్రి ఆలయ ఏఈవో మేడిశివకుమార్ తన కవితలో ఉలి కదిలింది మెల్లగా.. శిలపై సౌందర్యాలల్లగా.. అంటూ లికి నేనేమివ్వగలను అంటూ ఊగిపోయారు. కవులు మెరుగు వెంకటదాసు, లింగపంల్లి రామచంద్ర, చిక్కా రామదాసు, డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ, శిఖ గణేశ్ డాక్టర్ రచ్చ యాదగిరి, డాక్టర్ జి.రఘురామశర్మ, బండారు జయశ్రీ, వజ్జల వెంకటరామనర్సింహాచార్యులు, పెసరు లింగారెడ్డి, జనమంచి చరణ్, యువకవి హరీశ్ తమ కవితలలో నేటి కలి ప్రభావాన్ని దూరం చేసి భక్తుల్లో భక్తి భావనలు పెంపొందించమని శ్రీవారిని వేడుకున్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...