మంత్రులకు శుభాకాంక్షలు


Sun,March 17, 2019 12:01 AM

రాజాపేట : ఇటీవల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని శనివారం హైదరాబాద్ వారి నివాసాల్లో టీఆర్‌ఎస్ మండల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రసాదాలను అందజేశారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందించాలని మంత్రులను కోరారు. మంత్రులను కలిసిన వారిలో ఆలేరు మార్కెట్ డైరెక్టర్ గుర్రం నర్సింహులు, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల ప్రధానకార్యదర్శి రేగు సిద్ధులు, నక్కిర్తి కనకరాజు, జూకంటి బాలస్వామి ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...