రేపటి నుంచి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ


Sun,March 17, 2019 12:00 AM

రామగిరి : లోక్‌సభ సాధారణ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ సోమవారం నుంచి చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లోని లోక్‌సభ ఎన్నికలపై శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. నామినేషన్ల కోసం అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని, నామినేషన్ల సమర్పణకు వచ్చేటప్పుడు పాటించాల్సిన నియమ, నిబంధనలను రాజకీయ పార్టీ నాయకులకు సూచించాలని తెలిపారు. నామినేషన్ వేసే వ్యక్తితోపాటు ఇతర నలుగురు వ్యక్తులను మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోనికి అనుమతించాలని, నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లను ప్రభుత్వ సెలవు దినాల్లో స్వీకరణ ఉండదని, ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, సూర్యాపేట కలెక్టర్ అమయ్‌కుమార్, సూర్యాపేట డీఆర్‌వో చంద్రయ్య, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...