సైడ్‌లైట్స్


Sun,March 17, 2019 12:00 AM

రామగిరి : సభ ప్రారంభం మధ్యాహ్నం 2.30కి ఉండగా మధ్యాహ్నం 12 గంటలకే ఆయా నియోజక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు.
-మధ్యాహ్నం 12.30 నుంచే సభకు వచ్చిన వారికి ఎన్‌ఆర్‌ఎస్, ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ప్రముఖులకు, సభా స్థలికి ఎడమ వైపుగా ప్రత్యేకంగా నిర్మించిన షామియానాల్లో భోజనాలు ప్రారంభమయ్యాయి.
-ఇదే సమయంలో సాయిచంద్ బృందం ఆధ్వర్యంలో సభా వేదికకు కుడివైపున గల ప్రత్యేక వేదికపై కళాకారుల ఆటపాట ప్రారంభమైంది.
-మధ్యాహ్నం ఒంటి గంటకల్లా కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సారథ్యంలో సుమారు 5 వేల మంది కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై హైదరాబాద్ రోడ్డులోని జీ స్కూల్ వద్దకు చేరుకున్నారు.
-మధ్యాహ్నం 1.45 ని.ల నుంచి సభా వేదికపైకి టీఆర్‌ఎస్ ప్రముఖుల స్వాగతం జరిగింది.
-ఈ సమయానికే సభా స్థలి, సమీపంలోని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి మర్రిగూడ బైపాస్ సభకు వచ్చిన వారితో కిక్కిరిసింది. ఎటు చూసినా వాహనాలు, టీఆర్‌ఎస్ శ్రేణులే కనిపించాయి.
-మధ్యాహ్నం 2.30లకు కేటీఆర్ జీ స్కూల్ వద్దకు చేరుకోవడంతో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి సారథ్యంలో ఘనంగా పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతించారు.
-విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సభాస్థలికి చేరుకున్నారు.
-మధ్యాహ్నం 3 గంటలకు బైక్ ర్యాలీ
సమావేశ ప్రాంగణానికి చేరుకుంది.
-మధ్యాహ్నం 3.03 ని.లకు కేటీఆర్ సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి 3 గంటల 5 నిమిషాలకు సభా వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
-మధ్యాహ్నం 3.10 నుంచి 3.15 వరకు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవశర్మ, చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు పోతుల పాటి రామలింగేశ్వరశర్మ బృందం ఆధ్వర్యంలో బ్రాహ్మణులు కేటీఆర్‌కు వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం చేశారు. క్రిస్టియన్, ముస్లిం మత పెద్దలు సైతం ప్రత్యేక ప్రార్థనలు చేసి కేటీఆర్‌ను ఆశీర్వదించారు.
-3. 17 ని.లకు కేటీఆర్‌కు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సారథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ గజమాలతో సత్కారం, తలపాగ, ఖడ్గాన్ని అందజేసి స్వాగతించారు.
-3.23 నుంచి ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రారంభం కావడంతో ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ప్రసంగిస్తుంటే సభకు హాజరైన ఆ ప్రాంతాల నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం ప్రసంగించారు.
-3. 50 ని.లకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించారు.
-4.10ని.లకు కేటీఆర్ ప్రసంగం ప్రారంభమై 4.50 ని.ల వరకు సాగింది. సమావేశం అనంతరం పెద్ద ఎత్తున పటాకులు పేల్చారు.
-సభ ముగిసిన తర్వాత కేటీఆర్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసానికి వచ్చారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్‌కు ప్రత్యేక కాన్వాయ్‌లో వెళ్లారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...