పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు


Sat,March 16, 2019 12:11 AM

తుర్కపల్లి : కులం పేరుతో దూషించారంటూ ఒకరు, విధులకు ఆటంకం కలిగిస్తూ తనపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మరొకరు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. మండలంలోని గోపాల్‌పూర్ గ్రామ వీఆర్‌వో వెంకటేశం తాను విధులు నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన పూలపల్లి వెంకటేశ్ అడ్డుపడుతూ దాడికి పాల్పడ్డాడని అతనిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా తరలివెళ్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పాస్‌బుక్‌లో తన పేరు ఎక్కించాలని గ్రామానికి వచ్చిన వీఆర్‌వో వెంకటేశ్‌ను అడగడంతో తనపై కులం పేరుతో దూషించారని అదే గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డకింది రాములు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాములు, వీఆర్‌వో వెంకటేశ్ మధ్య జరుగుతున్న వివాదాన్ని చూసి ఆపేందుకే అక్కడికి వెళ్లానని, దానిని సాకుగా తీసుకొని వీఆర్‌వో తనపై దాడి చేసినట్టు కేసు నమోదు చేయడం సరైందికాదన్నారు. కాగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తనపై అకారణంగా పూలపల్లి వెంకటేశ్ దాడికి పాల్పడ్డాడంటూ వీఆర్‌వో వెంకటేశ్ తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...