పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు


Thu,March 14, 2019 11:42 PM

చండూరు, నమస్తేతెలంగాణ : వచ్చే నెలలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అందుకోసం సెక్టోరియల్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ అనితారాంచంద్రన్ అన్నారు. గురువారం స్థానిక భవానీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన మునుగోడు నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేంక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. నోడల్ అధికారులందరూ తమకు కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో చిన్న పొరపాటు జరిగినా పెద్ద శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి వేసవి తీవ్రత దృష్ట్యా టెంట్లు, తాగునీటిని ఏర్పాటు చేయాలన్నారు. హెల్ప్‌లైన్లు, టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై రోజువారీ నివేదిక అందజేయాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే టీంలు అన్ని కలిసికట్టుగా పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికా రులను ఆదేశించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్, సీఐ రవీందర్, తహసీల్దార్లు కృష్ణయ్య, జ్ఞానేశ్వర్‌దేవ్, అరుణజ్యోతి, దయాకర్‌రెడ్డి, రవీంద్రసాగర్, ఎంపీడీవోలు నరేందర్, శర్మ, శేషుకుమార్, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, జలంధర్‌రెడ్డి, ఎంఆర్‌ఐ చాంద్‌పాష, ఎస్‌ఐలు జానకిరాములు, శేఖర్, వీఆర్వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...