విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలి


Thu,March 14, 2019 11:42 PM

సంస్థాన్ నారాయణపురం : విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలని సంస్థాన్ నారాయణపురం సర్వేల్ జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు ఎం.విద్యాధర్‌రెడ్డి అన్నారు. టెక్‌యాన్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో గురువారం పాఠశాలలో రోబోటిక్ వర్క్‌షాప్ నిర్వహించారు. డ్రైవర్ లెస్‌కార్, రిమోట్ కంట్రోల్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న పెనుమార్పులను విద్యార్థులు తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. పరిశోధనతోనే మనుగడ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టెక్‌యాన్ ఫౌండర్స్ హరి, శ్రద్ధ, ఆపరేటింగ్ మేనేజర్ కోటేశ్వరప్రసాద్, ఇంజినీర్లు సుస్మిత, వైష్ణవి, పాఠశాల అధ్యాపక సిబ్బంది నర్సింహ, రమేశ్, నాగభూషణాచారి, వనజ, పద్మలక్ష్మి, అరుణకుమారి, రజాక్, నర్సిరెడ్డి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...