పోషకాహారంపై అవగాహన


Thu,March 14, 2019 11:42 PM

రాజాపేట : గర్భిణులు, కిషోర బాలికలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారంపై గురువారం మండల కేంద్రంలో మహిళలకు అంగన్‌వాడీ టీచర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోషణ లోపం నుంచి విముక్తి చేస్తామని మహిళలు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, పార్వతి, భారతి, చంద్రకళ, స్వప్న, రజిని, లక్ష్మి తదితరులు ఉన్నారు.

విద్యార్థులకు పౌష్టికాహారం తప్పనిసరి..
ఆలేరుటౌన్ : విద్యార్థులకు చదువుతో పాటు పౌష్టికాహారం తప్పనిసరి అని ఐసీడీఎస్ సీడీపీవో చంద్రకళ అన్నారు. జాతీయ పౌష్టికాహారం ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలేరు పట్టణంలోని జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులు-పౌష్టికాహారం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పౌష్టికాహారం లోపంతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడితో చదువులు కూడా చక్కగా చదువలేరన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నేటి తరం విద్యార్థులు అర్థం చేసుకొని మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు కావాలని, నిస్వార్థంగా దేశసేవ చేయాలన్నారు. సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. చిన్నతనం నుంచే విద్యపై దృష్టి సారించాలన్నారు. ఆమె కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఉమారాణి, అంగన్‌వాడీ టీచర్ పద్మజా, విద్యార్థులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...