సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి


Thu,March 14, 2019 11:41 PM

సంస్థాన్‌నారాయణపురం : విద్యార్థి దశనుంచే సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలని టెక్‌యాన్ టెక్నాలజీ ఫౌండర్స్ హరి అన్నారు. మండల పరిధిలోని సర్వేల్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు రోబోటెక్ వర్క్‌షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా 6,7 వ తరగతి విద్యార్థులకు రిమోట్ కంట్రోల్ రోబో గురించి, 8,9 తరగతి విద్యార్థులకు డ్రైవర్‌లెస్ కార్లను విద్యార్థులచే తయారు చేయించి శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టెక్‌యాన్ టెక్నాలజీ సంస్థ ఇంజినీర్లు శ్రద్ధ్ద, ఆపరేటింగ్ మేనేజర్, కోటేశ్వరప్రసాద్, రోబోటెక్ ఇంజినీర్లు సుస్మిత, వైష్ణవి, పాఠశాల హెచ్‌ఎం ఎం.విద్యాధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...