పనిదినాలు 27,63,100


Sat,February 23, 2019 11:52 PM

-ష్కరిణిలో మండపం నిర్మాణం -్తంభాలపై శ్రీలక్ష్మీనరసింహుని లీలలు తెలిపే కళాఖండాలు
- జయస్తంభాలపై భీములను అమర్చే పనులు చేపట్టిన శిల్పులు
- ది దశకు చేరుకుంటున్న నిర్మాణాలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టబోయే పనులకు సంబంధించి జిల్లా గ్రామీణావృద్ధి శాఖ ప్రణాళిక లు సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1, 53, 900 మందికి జాబ్ కార్డులు ఉండగా 3,2, మంది కూలీలుగా నమోదై ఉన్నా రు. వీరందరికీ 27,63,100 రోజుల పని దినాలు కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మండలాల వారీగా ఇప్పటికే పనులు, కూలీల పనిదినాలను కేటాయించారు. అయితే మున్సిపాలిటీల్లో విలీనమైన 17 గ్రామాల్లో ఉపాధి నిలిచిపోవడంతో అక్కడ కూడా తిరిగి పనులు ప్రారం భించనున్నారు. కొత్త పంచాయతీల్లోనూ పనులు షురూ కానున్నాయి. 16 మండలాల్లోని 401 పంచాయతీల్లో ప్రభుత్వం పెట్టిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మందడి ఉపేందర్‌డ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లావూపతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పుష్కరిణిలో నిర్మాణం చేసే మండపం నిర్మాణానికి అవసరమైన నాలుగు స్తంభాలను తయారు చేసే పనులు చేపట్టారు. పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించాక జరిపే పూజలకు శ్రీవారిని పుష్కరిణిలో నిర్మాణం చేసే మండపంలో విశ్రాంతి కోసం కొద్దిసమయం ఉంచి సపర్యలు చేస్తారు. దీని కోసం మండపాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మాణం చేస్తారు. స్తంభాలను తయారు చేసిన శిల్పులకు వాటిపై శ్రీమహావిష్ణువు లీలను తెలిపే కళాఖండాలను చెక్కడం కోసం స్తపతి డాక్టర్ ఆనందాచారి వేలు మార్కింగ్ చేశారు. నాలుగు స్తంభాలపై శ్రీలక్ష్మీనరసింహుని లీలా విశేషాలతోపాటు క్షీరసాగరమథనముకు సంబంధించిన కళారూపాలను కూడా చెక్కుతారు. గంగాదేవి మొసలితో ఉన్న శిల్పము, ఐరావతము, లక్ష్మీదేవితోపాటు విష్ణుమూర్తి రూపాలను చెక్కడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపైన తెప్పోత్సవం తదితర శ్రీవారి సేవల కోసం ఉపయోగించుకునేందుకు రూ.11 కోట్లతో అత్యంత అధునాతన పద్ధతిలో పుష్కరిణి నిర్మాణం చేయనున్నారు. దీని కోసం రూ.5.50 కోట్లతో సివిల్ పనులు పేపట్టారు. మిగతా నిధులు శిల్పి పనులకు కేటాయించారు. సీఎం ఈ నెల 3న వచ్చిన సందర్భంగా సివిల్ పనుల నిర్వహణలో పలు లోపాలున్నట్టు గుర్తించి వాటిని నిలుపుదల చేశారు. కానీ శిల్పి పనులు పుష్కరిణి వద్ద మొదలు కాకపోవడంతో వాటి విషయంలో సీఎం జోక్యం చేసుకోలేదు. సివిల్ పనులు పూర్తి చేసి ఇస్తే శిల్పి పనులు మొదలవుతాయి. ఈలోగా మండపానికి అవసరమైన శిల్పాలు తయారు చేసే పనిలో శిల్పి పనులు నిర్వహిస్తున్న స్తపతులు దృష్టి సారించారు. సీఎం సివిల్ పనుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సమాంతరంగా రెండు పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

విజయస్తంభాలపై రాతి భీములను అమరుస్తున్న శిల్పులు..
విజయస్తంభాలపై భారీ క్రేన్ సహాయంతో రాతి భీములను అమర్చే పనులను శిల్పులు చేపట్టారు. స్తపతి డాక్టర్ ఆనందాచారి వేలు పర్యవేక్షణలో ఉప స్తపపతులు, శిల్పులు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి కృష్ణశిలలతో తయారు చేసిన భీములను అమర్చారు. ఇంకా రెండుమూడు రోజులు ఇవే పనులు జరుగుతాయని స్తపతి తెలిపారు. కొండపై ఒక్కో నిర్మాణం పూర్తవుతుండటంతో నిర్మాణాలు చూడముచ్చటగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాజుల కాలం తరువాత ఇలాంటి భారీ నిర్మాణాలు పూర్తిగా కృష్ణశిలలతో చేపట్టింది ఎక్కడా లేకపోవడంతో భక్తులు పనులు జరుగుతున్న తీరును ఆసక్తిగా గమనిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 3న యాదావూదిశ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి పనులను స్వయంగా పర్యవేక్షణ చేయడంతో శిల్పి పనుల్లో వేగం పెరిగింది. సివిల్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సివిల్ పనుల నిర్వహణకు సరికొత్త డిజైన్లను రూపొందించాలని ఆలయ నిర్మాణ పరిధిని 2.3 ఎకరాల నుంచి 4.5ఎకరాలకు పెంచాలని చేసిన సూచనల మేరకు ఇంజినీర్లు అంచనాలు చేసే పనిలో పడ్డారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...