తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్


Sat,February 23, 2019 11:45 PM

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌డ్డి
-పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిక
బీబీనగర్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌డ్డి అన్నారు. శనివారం బీబీనగర్‌లో ఆయన సమక్షంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నారగోని మహేశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్కజైపాల్‌డ్డి ఆధ్వర్యంలో పెద్దపలుగు తండాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బానోతు జగన్నాథం తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్షికమాల్లో ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌డ్డి, వైస్ ఎంపీపీ కొంతం లింగయ్యగౌడ్, రాష్ట్ర నాయకుడు ఎరుకల సుధాకర్‌గౌడ్, సర్పంచ్‌లు మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, బానోత్ బిచ్చానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పంజాల సతీశ్, పట్టణ అధ్యక్షుడు మంగ అశోక్, ఉపసర్పంచ్ దస్తగిరి, నాయకులు పంజాల బాల్‌రాజుగౌడ్, సోమగోపాల్, జక్కి నగేశ్, శివకుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...