యాదాద్రిలో నిత్యపూజల కోలాహలం


Sat,February 23, 2019 11:42 PM

-జల్లో పాల్గొని తరించిన భక్తజనం
-వారి ఖజానాకు రూ.10,01,676 ఆదాయం
- నుంచి పూజల్లో పాల్గొన్న భక్తులు
యాదావూదిభువనగిరి జిల్లావూపతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. యాదావూదిలో నిత్య పూజల సందడి కొనసాగుతున్నది. పలు ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి ధర్మ దర్శనాల్లో 2 గంటలు, ప్రత్యేక దర్శనాల్లో గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం గంటలకు నిర్వహించిన శ్రీ సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా కళ్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ.100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీవారి ముఖ మండపంలో స్వామివారిని దర్శించుకున్నామన్న ఆనందం ఈ పూజలతో భక్తులకు కలుగుతుంది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహవూసనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామి వారి పూజల్లో భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి ఖజానాకు రూ.10,01,676 ఆదాయం శ్రీవారి ఖజానాకు రూ.10,01,676 ఆదాయం సమకూరినట్టు ఆదాయ శాఖాధికారులు తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.3,75,70, ప్రధాన బుకింగ్‌తో 1,4,50, వ్రత పూజలతో ఖజానాకు రూ.1, 06,500, ఆదాయం సమకూరింది. గదులు విచారణ శాఖతో రూ.1,00 ఆదాయం వచ్చిందని చెప్పారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...