కన్నవారి కలలను నెరవేర్చాలి


Fri,February 22, 2019 11:27 PM

ఆలేరుటౌన్ : కన్నవారి కలలను నెరవేర్చాలని తాల్క ట్రస్ట్ చైర్మన్ తాల్క ఉషశ్రీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు తాల్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి యేట నగదు బహుమతులను అందజేస్తున్నారు. 2017-18వ సంవత్సరం విద్యార్థులకు నగదు పురస్కారాలను శుక్రవారం ఆలేరు పట్టణంలోని జడ్పీహెచ్ స్కూల్‌లో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులను ప్రోత్సాహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 1986 నుంచి ఇప్పటివరకు ప్రతియేటా నగదు పురస్కారం అందజేస్తున్నామన్నారు. మేమిచ్చే నగదు పురస్కారం కన్నా కన్నవారి కలలను నెరవేర్చినప్పుడే సార్థకత అన్నారు. విద్యార్థులు బాగా కష్టపడి ఉన్నత స్థానాలకు వెళ్లి సమాజానికి ఉపయోగపడాలన్నారు. అనంతరం ప్రథమస్థానం పొందిన విద్యార్థులు ఎండీ మహీన్, కట్కమోజు జ్యోతి, మౌనిక, వలిగొండ సంధ్యకు రూ.1016 నగదు బహుమతి, ద్వితీయస్థానం పోందిన బి.రేణుక, చిరబోయిన లావణ్య, ఉరడి శిరీష, బి.ఉమేశ్, మాటూరు సుష్మ, సొప్పరి ఉషారాణికి రూ.516 అందజేశారు. కార్యక్రమంలో యువకవి బైరపాక స్వామి, బాలుర, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్యాంసుందరి, ఇందిరా ప్రియదర్శిని, దూడల వెంకటేశ్, మంద సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...