జియాపల్లిలో వ్యవసాయ విస్తరణ కార్యాలయం


Fri,February 22, 2019 11:25 PM

బీబీనగర్ : గ్రామాల్లో రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండేలా మండలంలో 34గ్రామాలకు గాను 4 క్లస్టర్లుగా విభజించి క్లస్టర్‌కు ఒక అసిస్టెంట్ వ్యవసాయధికారులను నియమించినట్లు జిల్లా వ్యవసాధికారి అనురాధ తెలిపారు. శుక్రవారం ఆమె మండల కేంద్రంలోని జియాపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన వ్యవసాయ విస్తరణ అధికారి క్లస్టర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ రైతులకోసం సర్పంచ్ బొర్ర సంతోషారమేశ్, నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్ ముందుకు వచ్చి వ్యవసాయ కార్యాలయం కోసం భవనాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందించారు. మిగితా క్లస్టర్లలో కూడా ఇలాగే భవనాలను కేటాయిస్తే గ్రామంలోనే విస్తరణ అధికారులు ఉంటూ ఎల్లవేలలా రైతులకు అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. అనంతరం మండల వ్యవసాయాధికారి పద్మతో కలిసి గ్రామంలోని పంటపొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ వ్యవసాధికారి ఉదయ్‌కిరణ్ తదితరు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...