మాజీ ఎమ్మెల్యే నంద్యాల మృతి


Thu,February 21, 2019 02:56 AM

కట్టంగూర్, నమస్తే తెలంగాణ: నకిరేకల్ మాజీఎ మ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి(101) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కట్టంగూర్ మండలం ము త్యాలమ్మగూడెంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీనివాస్‌రెడ్డి కేతేపల్లి మం డలం కొప్పోలులో 1920లో అప్పారెడ్డి, లక్ష్మీనర్సమ్మ దంపతులకు జన్మించారు. ఆయ న తన చదువును సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో కొనసాగించారు. చదువుకునే రోజుల్లో తన సహచర విద్యార్థిగా ఉన్న ధర్మభిక్షంతో కలిసి ఉద్యమం వైపు అడుగులు వేశారు. 1940లో మల్కాపూర్‌లో నిర్వహించిన ఆంధ్రమహసభకు తొలిసారి హాజరైన ఆయన ఆ తర్వాత చిలుకూరు, భువనగిరి, వరంగల్, ఖమ్మం మహాసభల్లో పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త గా ఉన్న ఆయన అప్పట్లోనే తమకున్న 900 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టారు. సాయుధ పోరాటం లో మిలటరీవిభాగంలో దళకమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిం రు. పోలీసులు ఆయనను 1949 లో అరెస్టు చేసి సంవత్సరంపా టు జైలులో ఉంచారు. అయినా దాడులు ఆపకపోవడంతో ఉరిశిక్ష విధించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. జైలు నుంచి తప్పించుకొని మళ్లీ ఉద్యమంలో చేరి రావినారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, బసవపున్నయ్య, సుందరయ్య, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలతో కలిసి పనిచేశారు. 1962లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టు పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

పలువురి సంతాపం
శ్రీనివాస్‌రెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీఎమ్మెల్యే వేములు వీరేశం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు ఆయన భౌతికాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాలకు గురువారం అప్పగించనున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...