కళాశాలల గుర్తింపుపై యూనివర్సిటీ తనిఖీలు


Thu,February 21, 2019 02:56 AM

ఎంజీ యూనివర్సిటీ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి)లోని డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ కళాశాలల వార్షిక గుర్తింపు కోసం ప్రతి సంవత్సరం ఎంజీయూ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్‌సెల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తారు. దీనిలోభాగంగా ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని కళాశాలల్లో తనిఖీలు పూర్తి చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా లో తనిఖీలను ప్రారంభించారు. తొలిరోజు జిల్లా కేంద్రంలోని నీలగిరి, కాకతీయ, శ్రీచైతన్య, నలంద, సిద్ధ్దార్థ డిగ్రీ కళాశాలల్లో వేర్వేరు బృందాలు యూనివర్సిటీ నిబంధనల మేరకు తనిఖీలు చేశారు. కళాశాల రికార్డులు, విద్యార్థుల, అధ్యాపకుల హాజ రు రిజిస్టర్లు, టీచింగ్ డైరీలు, తరగతి గదులు, ల్యాబ్స్, ఇతర అంశాలను పర్యవేక్షించారు. యూనివర్సిటీ నిబంధనల మేరకు నిర్వహిస్తున్న కళాశాలలకే 2019-20 సంవత్సరానికి అప్లియేషన్(గుర్తింపు) జారీ చేయనున్నారు. తనిఖీలు చేస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే కళాశాలల బండారం బయట పడనుంది. తనిఖీలలో ఎంజీయూ డైరెక్టర్ ఆఫ్ ఆడిట్‌సెల్ అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ రామచంద్రం, డాక్టర్ సబినా హెరాల్డ్డ్, డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, ప్రవళిక, హరీష్, జ్యోతి, వసంత, సంధ్యారాణితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...