పురుగులమందు తాగి మహిళ ఆత్మహత్య


Tue,February 19, 2019 11:44 PM

వలిగొండ : పురుగులమందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మండల పరిధిలోని జాలుకాల్వ గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సరోజ కూతురు సామ విజయ(40) కొన్ని సంవత్సరాల కిందట భర్త నుంచి విడిపోయి తల్లితో కలిసి జాలుకాల్వలో ఉంటుంది. చాలా రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయ ఆదివారం ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఎంత వెతికినా ఆచూకి తెలియలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్తుండగా పురుగుల మందు తాగి మృతి చెందిన విజయ గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసక్సై ఇద్రీస్ అలీ, ఏఎస్సై యాదగిరి తెలిపా

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...