సాధించాలనే తపన ఉంటే అసాధ్యమేదీ లేదు


Tue,February 19, 2019 12:06 AM

ఆలేరుటౌన్: సాధించాలనే తపన ఉంటే ఈ ప్రపంచంలో అసాధ్యమేదీ లేదని జిల్లా విద్యాధికారి ఆర్. రోహిణి అన్నారు. ఆలేరు పట్ణణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా శ్రీ రామకృష్ణ విద్యాలయం క్రమశిక్షణతో విద్య అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విలువలతో కూడిన విద్య, భారతీయ సంస్కృతికి నిలువుటద్దంగా విద్యార్థులను తీర్చిదిద్దడం చాలా కష్టమని, చదువుతో పాటు సంస్కారం నేర్చుకొనే విద్యార్థులు ఈ స్కూలులో ఉండటం చూస్తే ముచ్చటేస్తుందన్నారు. అందుకే ప్రతియేటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఇక్కడి విద్యార్థులను చూస్తే శారీరకంగానే కాదు మానసికంగా దృఢంగా ఉన్నారని, యోగాను అభ్యసించడం అపూర్వమన్నారు. అందుకే ప్రతియేటా 10కి 10 గ్రేడ్ సాధించడం వీరికే సాధ్యమన్నారు. కష్టపడి చదివి కన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం గత వార్షిక పరీక్షలో 10 గ్రేడ్ సాధించిన టీ భాశ్విని, యెలగందుల మనస్విని, చింతకింది తపన్, జంగ పవన్‌కు రూ.5500 విలువ చేసే బంగారు మెడల్‌ను అందజేశారు. డాన్స్‌లో మంచి ప్రతిభ ప్రదర్శించిన రమదుర్గారమకు వెండి మెడల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యాలయం ప్రధానచార్యులు బండిరాజుల శంకర్ శాలువా కప్పి భగవద్గీత పుస్తకం అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.లక్ష్మీనారాయణ, ప్రముఖ కవి పోరెడ్డి రంగయ్య, ప్రొఫెసర్ డా కరుణాకర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...