కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన


Tue,February 19, 2019 12:06 AM

భువనగిరి టౌన్ : ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ప్రజలు పెద్ద ఎత్తున కంటి వెలుగు శిబిరాలకు చేరుకుని కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 బృందాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. శిబిరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అందుకనుగుణంగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపడుతున్నది. కంటి వెలుగు శిబిరం నిర్వహించే ముందు రోజే ఆయా ప్రాంతాల్లో టాంటాం వేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నది. శిబిరాల నిర్వహణ సందర్భంగా అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు అందజేయడంతో పాటు అవసరమైన ఆపరేషన్లు చేయిస్తున్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,42,587 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన 59,620 మందికి అద్దాలు అందజేశారు. మరో 15,479 మందిని ఆపరేషన్ల కోసం రెఫర్ చేశారు. సోమవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 2241 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 196 మందికి అద్దాలు అందజేశారు. మరో 84 మందిని ఆపరేషన్ల కోసం రెఫర్ చేశారు. శిబిరాల నిర్వహణను డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...