రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం


Tue,February 19, 2019 12:05 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామికి సోమవారం విశేష సంఖ్యలో భక్త జనులు రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో శివుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా శివుడ్ని కొలుస్తూ గంటన్నర పాటు రుద్రాభిషేకంలో మమేకం అయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు డా అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాభిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఆలయం ఉప ప్రధాన పురోహితులు గౌరీబట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీలక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు నిత్య కల్యాణోత్సవం జరిపించారు.
ఖజానాకు రూ. 13,14,790 ఆదాయం
శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 89,882, ప్రసాద విక్రయాలతో రూ. 5,82,185, విచారణ శాఖతో రూ.18,045 తో పాటు అన్ని విభాగాల నుంచి రూ. 13,14,790 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆదాయశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు రామ్మోహన్, గజ్వేల్ రఘు, సార నర్సింహ పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...