నేటి నుంచి సర్పంచులకు శిక్షణ


Sun,February 17, 2019 11:44 PM

భూదాన్‌పోచంపల్లి : ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లకు ఈ నెల 18 నుంచి మార్చి 15 వరకు నాలుగు విడుతల్లో పంచాయతీరాజ్ చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఈ శిక్షణకు జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ వేదిక కానున్నది. ఇప్పటికే సర్పంచ్‌ల శిక్షణ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన 400 మంది నూతన సర్పంచ్‌లు పంచాయతీరాజ్ చట్టంలో రాజ్యాంగ పరంగా తమకు అందించిన విధులు బాధ్యతలు, కర్తవ్యాలను క్షుణంగా నేర్చుకోనున్నారు. వీరికి పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా ఈ చట్టాల గూర్చి వివరించడానికి అధికారులు 10 మంది అధ్యాపకులను ( టీవోటీ) లను నియమించింది. వీరి పర్యవేక్షణలో పంచాయతీరాజ్ చట్టంలోని అన్ని విషయాలు ఇక సర్పంచ్‌లు వల్లె వేయనున్నారు.
మొదటి విడుత
జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గలతోపాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్, అడ్డగూడూరు, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం మండలాల సర్పంచ్‌లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ నెల 18 నుంచి 22 వ వరకు ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు 14 మంది సర్పంచ్‌లకు, బొమ్మలరామారం 34 మంది , రాజాపేట్ 23 మంది, తుర్కపల్లి 31 మంది సర్పంచ్‌లతో మొత్తం 102 పంచాయతీల సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.
రెండో విడుత .. ఈనెల 25నుంచి మార్చి 1వ తేదీ వరకు ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ల మండలంలోని 23 మంది సర్పంచ్‌లకు, ఆత్మకూర్ మండలంలోని 23 మంది , మోటకొండూర్ మండలంలోని 18 మంది, తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మండలంలోని 10 మంది , అడ్డగూడూరు మండలంలోని 17 మంది సర్పంచ్‌లతో కలిపి మొత్తం 91 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.
మూడో విడుత
మార్చి 5 నుంచి 9వ తేదీవరకు భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలంలోని 37 మంది సర్పంచ్‌లకు, బీబీనగర్ మండంలోని 34 మంది , భువనగిరి మండలంలోని 34 మంది సర్పంచ్‌లతో కలిపి మొత్తం 105 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
నాలుగో విడుత
మార్చి 11 నుంచి 15వ తేదీవరకు నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలోని 24 మంది సర్పంచ్‌లకు, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలోని 26 మంది, సంస్థాన్ నారాయణపురం మండలంలోని 31 మంది సర్పంచ్‌లకు భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్‌పోచంపల్లి మండలంలోని 22 మంది సర్పంచ్‌లతో మొత్తం 103 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...