యాదాద్రిలో భక్తుల సందడి


Sun,February 17, 2019 11:44 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, :నమస్తే తెలంగాణ : యాదాద్రి పంచనారసింహ క్షేత్రం ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది.శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. యాత్రికుల వాహనాలతో ఆలయ దారులు, పట్టణ వీధులు గజిబిజిగా మారాయి. సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైనది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ.100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రు ద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
వైభవంగా వత్ర పూజలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి సామూహిక వత్రాల్లో భక్తులు పాల్గొన్నారు. ్ర వ్రత పూజల ద్వారా రూ.1,33,000 ఆదాయం సమకూరింది.
శ్రీవారి ఖజానాకు రూ.18,19,213 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 18,19, 213 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1,47,570, 100 రూపాయల టికెట్‌తో రూ. 37,700, 150 రూపాయల టికెట్ దర్శనంలో రూ.5,32,500, గదులు విచారణ శాఖతో రూ. 18,440, ప్రసాదవిక్రయాలతో రూ.7, 90,000 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...