కనుల పండువగా లక్షపుష్పార్చన


Sun,February 17, 2019 12:27 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం లక్ష తులసీ పుష్పార్చనలో కనుల పండువగా శ్రీవారికి కొలుస్తూ పూజాకైంకర్యాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం ఈ అర్చనలో పాల్గొన్నారు. తెల్లవారు జాము నాలుగు గంటల నుంచి నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఏకశిఖరవాసుడిని దర్శించి నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. శ్రీలక్ష్మీనరసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు. సుప్రభాతం చేపట్టిన అర్చకులు ప్రతిష్టమూర్తులను ఆరాధిస్తూ హారతిని నివేదించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం, అర్చన చేపట్టారు. లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. బాలాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సా యంత్రం అలంకార జోడు సేవోత్సవాలను సంప్రదాయంగా నిర్వహించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన జరిపి సహస్రనామార్చన నిర్వహించారు. కొండపైన రామలింగేశ్వరాలయంలో శివుడిని ఆరాధిస్తూ అభిషేకించి అర్చించారు. పార్వతీదేవిని వేదమంత్రాలతో కొలిచారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వారి సామూహిక వత్రాల్లో భక్తులు పాల్గొన్నారు. వ్రత పూజల ద్వారా రూ. 1,25,000, ఆదాయం సమకూరింది.

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దేవాదాయ
ధర్మదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గీత శ్రీవారి ప్రసాదం అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ సండ్ర మల్లేశ్, ఆలయ ఉప ప్రధానార్చకులు బట్టర్‌సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకబృందం ఆశీర్వచనం చేశారు. ఆలయ ఉద్యోగుల పక్షాన అధ్యక్షుడు జి.రమేశ్‌బాబు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఏఈవో వేముల రామ్మోహన్ పాల్గొన్నారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం
రూ.15, 02, 822 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ 15, 02, 822 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1, 65,072 కల్యాణకట్ట ద్వారా రూ. 30,000 గదులు విచారణ శాఖతో రూ. 71,280 ప్రసాదవిక్రయాలతో రూ.4,08,535 శాశ్వత పూజల ద్వారా రూ.13,116 తో పాటు అన్ని విభాగాల ద్వారా ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...