ఘనంగా శ్రీమార్కండేశ్వరస్వామి రథోత్సవం


Sat,February 16, 2019 12:05 AM

భూదాన్‌పోచంపల్లి: శ్రీ మార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రథాంగహోమం నిర్వహించారు. పోచంపల్లికి చెందిన సీత వంశస్తుల ఆధ్వర్యంలో జరిగిన రథోత్సవం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. కళాకారుల నృత్యాలు కోలాటం ఆకుట్టుకున్నాయి. కార్యకర్యక్రమంలో జడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ కర్నాటి రవీందర్, టీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు గుండు మధు, పద్మశాలీ మహాజన సంఘం అధ్యక్షుడు భారత పురుషోత్తం, మార్కండేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ కడవేరు రాములు, పోచంపల్లి అర్బన్ బ్యాకు చైర్మన్ చిట్టిప్రోలు శ్రీనివాస్, సీత వెంకటేశం, సీత అంజనేయులు, సీత శ్రీరాములు, సీత భాస్కర్, మంగళపల్లి శ్రీహరి, సీత సత్యనారాయణ, సీత దామోదర్, టీఆర్‌ఎస్ నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, సీత శ్రవణ్‌కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి ప్రతినిధులు భారత బాలకిషన్, భోగ స్వామి, ముస్కూరి నర్సింహ, భోగ బాల్‌నర్సింహ, పుప్పాల నాగేశ్వర్, కుడికాల ఎల్లయ్య, కలకం తుకారాం, మిర్యాల వెంకటేశం, బోద రమాదేవి, చిట్టిప్రోలు వసంత తోపాటు దేవాలయ అర్చకులు దోర్నాల కృష్ణ, రుద్ర పాండురంగం, నరేందర్, మహేశ్వరం ప్రసాద్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...