ఎంబీసీ కార్పొరేషన్ దేశమంతటా అమలు చేయాలి


Thu,February 14, 2019 11:21 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎంబీసీ కార్పొరేషన్‌ను దేశమంతా అమలు చేయాలని, ఎంబీసీల్లో వెనుకబడిన కులాలను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కె.సి.కాలప్ప అన్నారు. ఈ మేరకు కాలప్ప ఆధ్వర్యంలో ఎంబీసీ సంఘం నాయకులు గురువారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతల శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్‌హాల్లో టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ బండ ప్రకాశ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ బి.బి.పాటిల్, సీతారాంనాయక్ ఆధ్వర్యంలో కాలప్ప ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసినట్టు ఎంబీసీ రాష్ట్ర శాఖ యూవత విభాగం అధ్యక్షుడు చిందం పాండు వంశరాజ్ గురువారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఎంబీసీలు చాలా వెనుకబడి ఉన్నారని, వీరిని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీ రిజర్వేషన్స్ 52 శాతం పెంచాలని కోరినట్టు చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లోకి ఎంబీసీ నాయకులను తీసుకువెళ్లేందుకు సహకరించిన ఎంపీలు బండ ప్రకాష్, బడుగుల లింగయ్యయాదవ్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంఘం జాతీయ వైస్ ప్రెసిడెంట్ ప్రేమలాల్, అధ్యక్షుడు మల్లికార్జున్, స్టేట్ శేఖరాచారి, లక్ష్యణ్, కిన్నెర శేఖర్, నిరంజన్, రఘు, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...