వేగం వద్దు.. ప్రాణం ముద్దు


Thu,February 14, 2019 01:17 AM

జాయింట్ కలెక్టర్ రమేశ్
భువనగిరి టౌన్ : వేగం వద్దు.. ప్రాణం ముద్దని జాయింట్ కలెక్టర్ రమేశ్ అన్నారు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని జయలక్ష్మి గార్డెన్‌లో జిల్లా రవాణా శాఖ, ఇండియన్ రెడ్‌క్షికాస్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగారక్తదాన శిబిరాన్ని డీసీపీ రామచంవూదాడ్డి, డీటీవో సురేందర్‌డ్డిలతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. తల్లిదంవూడులు పిల్లలపై ఉన్న మమకారంతో వారు అడిగిందే తడవుగా వాహనాలు కొనుగోలు చేసి ఇస్తారన్నారు. వారు వాహనాలను అతివేగంగా నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకొని తల్లిదంవూడులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ తప్పక ధరించడంతో పాటు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించడంలో అలక్ష్యం వహిస్తే మీ ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను ఇబ్బందుల్లో పెట్టిన వారవుతారన్నారు. సరైన సమయానికి రక్తం అందక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారన్నారు. రక్తదానం మరోకరికి ప్రాణదానమన్నారు. రక్తాన్ని సృష్టించలేమని ఆరోగ్యవంతమైన ప్రతీ వ్యక్తి తప్పనిసరిగా మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చునన్నారు. రక్తదానానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్నారు. డీసీపీ రామచంవూదాడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ప్రయాణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను కొంతమేర నియంవూతించవచ్చని చెప్పారు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ శిబిరంలో రక్తదానం చేసిన వారందరూ రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసిన వారవుతున్నారన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురుకావన్నారు. ఆరోగ్యవంతమైన ప్రతీ వ్యక్తి రక్తదానం చేయాలన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి యాస సురేందర్‌డ్డి మాట్లాడుతూ రక్తదానం మహాదానమన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎదుటి వారి ప్రాణాలను కాపాడిన వారవుతారని చెప్పారు. రహదారి భద్రతా నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలకు దూరం కావోచ్చన్నారు. కార్యక్షికమంలో జిల్లా రెడ్‌క్షికాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీనర్సింహాడ్డి, కోశాధికారి దాత్రక్ అంజయ్య, డైరెక్టర్ పురుషోత్తండ్డి, ప్రతినిధి డి.బాలాజీ, ఏఎంవీఐలు ఆర్.రఘుబాబు, విష్ణుదీప్‌డ్డి, సిబ్బంది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...