రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Thu,February 14, 2019 01:13 AM

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
రామన్నపేట : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ విజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పాసు పుస్తకాలు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండోసారి సీఎంగా కేసీఆర్ గెలువడం హర్షణీయమన్నారు. ధర్మాడ్డి, పిలాయిపల్లి కాల్వల ద్వారా సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేసి కాల్వ మరమ్మతులు పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్షికమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, సర్పంచ్ గోదాసు శిరీష, వీఆర్వోలు గుండెబోయిన స్వామి, నాతి రమేశ్, యాదయ్య, పాపయ్య, లింగస్వామి, రైతులు బొడ్డు ముత్తయ్య, మేడి లక్ష్మయ్య, దామనూరి నర్సింహ, సిందం లక్ష్మీబాయి, మంచికంటి కమల పాల్గొన్నారు
సంస్థాన్‌నారాయణపురం: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ విడుతలో భాగంగా 410 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశామన్నారు. మిగతా రైతులకు మరో రెండు విడుతల్లో పంపిణీ చేసి పూర్తి చేస్తామన్నారు. కార్యక్షికమంలో తహసీల్దార్ దయాకర్‌డ్డి, ఎంపీడీవో జలందర్‌డ్డి, ఆర్‌ఐ రవీందర్, వీఆర్‌వో పాషా పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...