సీఎం సభాస్థలి పరిశీలన


Mon,November 19, 2018 12:33 AM

భువనగిరి టౌన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 21న భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరగనున్న సీఎం కేసీఆర్ సభా స్థలాన్ని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో భువనగిరికి చేరుకుంటారు. హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం స్థానిక జిన్నింగ్‌మిల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలు, ఇతర ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ రాంచంద్రారెడ్డి, ఎసీపీ జితేందర్‌రెడ్డి, తహసీల్దారు కొప్పుల వెంకట్‌రెడ్డి, పట్టణ సీఐ వెంకన్న, విద్యుత్ శాఖ ఏఈ భిక్షపతి, ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఫైర్ ఆఫీసర్ అశోక్‌తోపాటు ఇతర శాఖల అధికారులున్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...