టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు


Mon,November 19, 2018 12:32 AM

వలిగొండ : భువనగిరి మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆదివారం అరూర్, వేములకొండ గ్రామాల్లో వర్కట్‌పల్లి మాజీ సర్పంచ్ నాగెళ్లి నర్సింహాస్వామి, ఎం.తుర్కపల్లి గ్రామానికి చెందిన యువకులు తుమ్మల యుగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 20 మంది యువకులు, నాతాల్లగూడెంలో టీడీపీ నాయకులు మోతె నర్సింహా, అయిలయ్య ఆధ్వ ర్యంలో 20 మంది, టేకులసోమారం మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో 20 మంది త్రిశూల్ యూత్ సభ్యులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వా నించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు దోహదపడుతాయన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జడల అమరేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్దన్‌రెడ్డి, వంగాల వెంకన్నగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బద్ధం భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, అరూర్ సింగిల్ విండో చైర్మన్ వాకిటి అనంతరెడ్డి, మదర్ డైయిరీ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి, మత్స్యగిరిగుట్ట చైర్మన్ కేసిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు శివశాంత్‌రెడ్డి, చిత్తడి జనార్దన్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...