దయాకర్‌కు టికెట్ కేటాయించడంపై ఆగ్రహం


Mon,November 19, 2018 12:31 AM

అడ్డగూడూరు : స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ వడ్డేపల్లి రవికుమార్ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పోలేబోయిన లింగయ్యయాదవ్ అన్నారు. మండలంకేంద్రంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను ఏనాడు పట్టించుకొని అద్దంకి దయాకర్‌కు టికెట్ ఎలా ఇస్తారన్నారు. 2104 ఎన్నికల్లో ఓడిపోయి టీవీ డిబెట్‌లకే పరిమితమైన అద్దంకికి టికెట్ ఇవ్వడంపై పార్టీ నష్టపోతుందన్నారు. పార్టీ కార్యాలయాలు లేకున్నా వడ్డేపల్లి రవికుమార్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసారన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శక్తి యాప్‌లను నియోజకవర్గంలోని ఏగ్రామంలో కూడా అద్దంకి దయాకర్ చేయలేదని విమర్శించారు . కార్యకర్తలు మరణించినప్పుడు కూడా పరామర్శకు రాని అద్దంకి దయాకర్ గెలుపు కోసం ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు. ఒక వేళ అద్దంకి దయాకర్ గెలిస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వరని తెలిపారు. నియోజకవర్గంలోని 9 మండలాల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మూకుమ్మడిగా రాజీనామాలను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేశ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు గూడెపు పాండు, మండల యూత్ అధ్యక్షుడు గూడెపు నాగరాజు, నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, హన్మకొండ ఆనందచారి, ఇటికాల చిరంజీవి, పూర్ణచందర్ , నిమ్మల సంతోష్‌గౌడ్ పాల్గొన్నారు

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...