అభివృద్ధి నిరోధకుడు భిక్షమయ్యగౌడ్


Sat,November 17, 2018 11:55 PM

ఆలేరుటౌన్ : ఈ రోజు ఆలేరులో అభివృద్ధి జరరుగలేదంటే దానికి కారణం బూడిద భభిక్షమయ్యగౌడ్ అని బీఎల్‌ఎఫ్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం ఆలేరు పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో భిక్షమయ్యలాంటి వ్యక్తిని చూడలేదన్నారు. ఎమ్మెల్యేగా ఆలేరును అన్ని రంగాలలో నిర్వీర్యం చేశాడన్నారు. భూ దందాలతో ఈ ప్రాంతంలో ప్రజల ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేశాడన్నారు. కోట్ల రూపాయలను సంపాయించి వాటిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడన్నారు. ఆలేరు ప్రజలు ఆయనకు ఓటేస్తే ఆలేరును ఎవరు కాపాడలేరన్నారు. ఎమ్మెల్యేగా తను గ్రామ గ్రామాన రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు, ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేశానన్నారు. ఈ రోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మోత్కుపల్లి అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఎడారిగా మారిన ఆలేరును సస్యశ్యామలం చేసేందుకు ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా బరిలోకి దిగానన్నారు. అందుకే గోదావరి జలాల సాధన పేరుతో తాను ప్రతి గ్రామాన్ని పర్యటించానని ప్రజలు తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశమివ్వాలని కోరారు. తనకు ఒంట్లో శక్తి లేకున్నా గోదావరి జలాలతో పంటలకు నీరు అందించాలని, రైతుల కాళ్లు కడుగాలనె తన చివరి కోరిక తీర్చాలని అంటూ ఆయన చేతులెత్తి ప్రజలకు నమస్కరించారు. కార్యక్రమంలో నాయకులు మంగ నర్సింహులు, జూకంటి పౌలు, ఎండీ సలీం, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...