కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దు


Fri,November 16, 2018 11:26 PM

మునుగోడు : ప్రజలను మోసగించేందుకు డబ్బు సంచులతో వస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని టీఆర్‌ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఊకొండి, రత్తుపల్లి, సోలిపురం, జక్కలివారిగూడెం గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం తపించానన్నారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన కూటమి నేతలను తరిమికొట్టి, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. హారతులిచ్చి, బొట్టుపెట్టి ఆశీర్వదించారు.

కార్యక్రమంలో ఎంపీపీ మేడి నాగలక్ష్మి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొడ్డు నర్సింహాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బండా పురుషోత్తంరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శులు లాల్‌బహదూర్‌గౌడ్, దాడి శ్రీనివాస్‌రెడ్డి, భవనం శ్రీనివాస్‌రెడ్డి, దండు యాదయ్య, నాగరాజుగౌడ్, పెరుమాళ్ల లక్ష్మయ్య, దొడ్డి యాదగిరి, భీమగోని నర్సింహ, ఐతరాజు పర్వతం, మాదగోని దేవలోకం, తంగెళ్ల సందీప్‌రెడ్డి, మేడి చంద్రస్వామి, మేడి అశోక్, ఏరుకొండ శ్రీనివాస్, బొడ్డుపల్లి శంకర్, బోయపల్లి రవి, రిషికేశ్‌గౌడ్, జక్కలి లోకేశ్, బొమ్మగోని లింగస్వామి, కందుల రాజుగౌడ్, రవి, బోయ సతీశ్, పగిళ్ల సతీశ్, గోపి, నీల వెంకన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...