సమైక్య పాలనలోనే ఆలేరు అధోగతి


Thu,November 15, 2018 11:31 PM

- మహాకూటమి మాయమాటలు నమ్మొద్దు
- సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి
- చేసిన అభివృద్ధిని చూసి ఆగమాగమవుతున్న ప్రతిపక్షాలు
- సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పాలన
- ఆలేరుకు గోదావరి జలాలు తేవడమే లక్ష్యం
- మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
- ఆలేరులోని పలు వార్డులు, కొలన్‌పాకలో ప్రచారం
ఆలేరుటౌన్, ఆలేరు రూరల్ : 60 ఏండ్ల సమైక్య పాలకుల పాపం ఆలేరుకు శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని పలువార్డుల్లో ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయన్నారు. నాలుగున్నర ఏండ్లు కనిపించని నేతలు ఇప్పుడు మాయమాటలు చెబుతూ గ్రామాల్లోకి వస్తున్నారన్నారు. వీరికి తగిన గుణపాఠం చెప్పే సరైన సమయం ఇదేనన్నారు. ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేని ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆలేరును సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు. ఆలేరు మండల కేంద్రంలో అన్ని హంగులతో కూడిన రైతు బజార్, చికెన్, మటన్ బజార్‌ను ఏర్పాటు చేయిస్తానన్నారు.

సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని టీఆర్‌ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డ్డి అన్నారు. ఆలేరు పట్టణంలోని పలు వార్డుల్లో, ఆలేరు మండలంలోని కొలనుపాక, రాఘవాపురం, బైరాంనగరం గ్రామాల్లో ఆమె గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆమెకు ఎదురొచ్చి మంగళహారతులిచ్చి, బొట్టు పెట్టి ఘనస్వాగతం పలికారు. ఆలేరు పట్టణంలోని భరత్‌నగర్, కురుమవాడ నుంచి రంగనాయకుల గుడి గుండా కొలనుపాక రోడ్డు నుంచి కనకదుర్గాదేవి మందిరం , ఆలేరు రైల్వే స్టేషన్ మార్గం నుంచి ప్రచార ర్యాలీ సాగింది. దుకాణదారులకు అభివాదం చేస్తూ ఆలేరు మండల కేంద్రంలో రైతు బజారు, మటన్ బజారు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు ఆలేరు పట్టణంలోని కేజేజే గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ ఉంటుందన్నారు. మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

టీఆర్‌ఎస్ సుపరిపానలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనకు కూటమితో తోక ముడుస్తున్నదన్నారు. అభివృద్ధిని చూసి తట్టుకోలేక.. ఓడిపోతామనే భయంతో కూటమి శ్రేణులు సోషల్ మీడియా ద్వారా దాడికి పాల్పడుతున్నారన్నారు. ఒక మహిళ అని చూడకుండా తనపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను ప్రజలకు జవాబుదారీతనం చేశామని, పటిష్టమైన పోలీసు వ్యవస్థతో హైదరాబాద్‌లో నాలుగున్నరేండ్లుగా శాంతియుత వాతావరణం నెలకొన్నదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలేరు నియోజకవర్గంలోని గోదావరి జలాల ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందించేందుకు తసాసుపల్లి కాల్వ పనులను చేపడుతామన్నారు. నిరుద్యోగులకు ప్రతి మండల కేంద్రంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, టీహబ్ తరహలో ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగాల్లో పనిచేసేందుకు కావలసిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామన్నారు.

మడమ తిప్పని నాయకుడు సీఎం కేసీఆర్...
మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాట తప్పని.. మడమ తిప్పని గొప్ప నాయకుడన్నారు. యాదగిరిగుట్ట మాదిరిగానే కొలనుపాకు అనేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. మిషన్ కాకతీయ కింద కొలనుపాకలోని చెరువుకు రూ.6కోట్లు నిధులు కేటాయించి మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామన్నారు. యాదగిరిగుట్టకు వచ్చే ప్రతి భక్తుడు కొలనుపాకకు వచ్చే విధంగా సోమేశ్వరాలయాన్ని పునరుద్ధరణ చేస్తామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ప్రయాణికుల ప్రాంగాణాలు, నూతన గ్రామ పంచాయితీ భవనాలు నిర్మించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని తెలిపారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలని, అప్పుడే సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఆలేరు మండల అధ్యక్షుడు మెహన్‌రావు, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ కిష్టయ్య, జిల్లా గ్రంథాలయ సభ్యుడు బాలస్వామి, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు జల్లి నర్సింహులు, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీటీసీలు మురళి, రవి, శ్రీను, కావ్యశ్రీ, ఆలేరు మార్కెట్ కమిటీ సభ్యుడు ఆంజనేయులు, మహేందర్‌రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు శమంతకమణి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కవిత, సుజాత, నాయకులు రామారావు, మల్లేశ్, ఆంజనేయులు, సోమిరెడ్డి, శ్రీనివాసు, బెంజారపు రవి, ఉడుగుల రవి, రాంప్రసాద్, వెంకటేశ్, ఆశోక్, కృష్ణ, రామకృష్ణ, మహేశ్, శ్రీకాంత్, సంతోశ్, ఇందిర, భాగ్యమ్మ, మధు, బీసీ నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్ నార్మాక్స్ డైరక్టర్ సోమిరెడ్డి, యువజన నాయకులు సిద్ధేశ్వర్, మధు, సంతోశ్, ఆంజన్‌కుమార్, ఎండీ ఫయాజ్, కళ్యాణ్, భరత్, శ్రీధర్, నరేశ్ మైనారిటీ నాయకులు మధార్, ముస్తఫా, గపూర్, రియాజ్, అక్బర్, షాబొద్దీన్, ఎండీ ఆశూ, నాయకులు మామిడాల అంజయ్య, అశోక్, రమేశ్, పాండు, బెదరబోయిన శంకర్, కుమ్మరిండ్ల ఆంజనేయులు, రాజు, ఒగ్గు శ్రీశైలం, మాసాపేట నరేందర్, బాల్‌నర్సయ్య, రాంరెడ్డి, మాసాపేట రాజు, కనకయ్య, నర్సింహులు, శశిరేఖ, పారుపల్లి అరుణ, చింతల రేణుక, ఉప్పలి రవీందర్, పరిదె సంతోష్ పాల్గొన్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...