నీళ్లు రాకుండా కేసులు వేసింది కోమటిరెడ్డే


Thu,November 15, 2018 11:30 PM

మునుగోడు : రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ రక్కసిని తరిమికొట్టేందుకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులపై కేసులు వేసి అడ్డుకున్నది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డేనని, ఈ ఎన్నికల్లో ఆయనకు సరైన గుణపాఠం చెప్పాలని టీఆర్‌ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చొల్లేడు, సానబండ, సింగారం, కచలాపురం గ్రామాల్లో భారీ ర్యాలీతో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా ఐదు సంవత్సరాల ఉండి ఈ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. డబ్బుతో ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని వారిని ప్రజలు నిలదీసి తరిమికొట్టాలన్నారు. కోమటిరెడ్డి డబ్బు అహంకారంతో పదవులను పశువుల్లా కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. కనీసం ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ప్రజల సమస్యలు తెలువవని, కనీసం గ్రామాల పేర్లు కూడా ఆయనకు తెలియవన్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభివృద్ధి, అవినీతి పార్టీల మధ్య యుద్ధం జరుగుతుందని, టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి, కూటమని బొందపెట్టాలని కోరారు. ప్రతినిత్యం ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రాంత బిడ్డగా ఒక సైనికుడిలా పని చేస్తున్నానని స్పష్టం చేశారు. జరిగే ఎన్నికల్లో గ్రామాల్లోని ప్రజలంతా కారు గుర్తుకే ఓటు వేసి తనకు మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు గ్రామాల్లోని మహిళలు, కోలాట బృందాలు హారతులతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణరావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బొడ్డు నర్సింహాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మామిళ్ల వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు లాల్‌బహదూర్‌గౌడ్, పరమేశ్, యాదయ్య, బొడ్డు నాగరాజు, పెరుమాళ్ల లక్ష్మయ్య, వేణుకుమార్, వనం భిక్షం, కట్కూరి శ్రీను, ముప్ప వెంకట్‌రెడ్డి, వనం లింగయ్య, బొడిగెపాక యేసు, వనం యాదయ్య, కట్కూరి శంకర్, చీముల సత్తయ్య, శంకర్, సాగర్‌రెడ్డి, ఉప్పునూతల ఉఫేందర్, జెట్టి గణేశ్, గురిజ సతీశ్, వనం సైదులు, వనం లక్ష్మి, జెనిగల కిష్టయ్య, మారయ్య పాల్గొన్నారు.

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...