కార్మికులంతా టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలి


Thu,November 15, 2018 11:30 PM

భువనగిరి టౌన్ : కార్మికుల కష్టం తెలిసిన సీఎం కేసీఆర్‌కు కార్మికులంతా అండగా నిలబడాలని టీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు మందుల వెంకటయ్య అన్నారు. పట్టణంలో కార్మికులతో కలిసి ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో సొంత డబ్బులతో కార్మికులకు ప్రమాద బీమా చేయించిన వ్యక్తి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. అలాంటి పైళ్ల శేఖర్‌రెడ్డికి కార్మికులంతా రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా 27వ వార్డులో టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ ప్రధానకార్యదర్శి నక్కల చిరంజీవియాదవ్, 18వ వార్డులో ఆ వార్డు కమిటీ అధ్యక్షుడు దండు కృష్ణల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌కేవీ డివిజన్ అధ్యక్షుడు కంచనపల్లి నర్సింగ్‌రావు, పట్టణ అధ్యక్షుడు అందె నర్సింగరావు, నాయకులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, పగిడిమర్రి వీరేశం, సిరిపంగ సుభాశ్, గౌళికార్ కిషన్, చింతల రాజు, చీమల శ్రీను, దుబ్బ యాదగిరి, చింతల యాదగిరి, కొలను సతీశ్, కూరం సంజీవ, అన్నారం రాజు, రమేశ్, రాధాకృష్ణ, మహిళా విభాగం నాయకుల మందుల సువర్ణ, రేష్మ, పద్మ, పుట్ట నాగమ్మ పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే అభ్యర్థిని గెలిపిస్తాయి
భువనగిరిఅర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల్ల శేఖర్‌రెడ్డిని గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ మహిళా విభాగం నియోజకవర్గ కన్వీనర్ సిద్ధుల పద్మ అన్నారు. గురువారం మండలంలోని రాయగిరి, మాస్‌కుంట, పెంచికల్ పహాడ్ గ్రామాల్లో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 60 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగున్నరేండ్లలో చేసిన ఘనత పైళ్ల్ల శేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించారన్నారు. మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచుతారన్నారు. కార్యక్రమంలో నాయకులు అంకర్ల సంజీవ నాయకురాలు జయమ్మ, నీల నర్సమ్మ, నీలమ్మ, లక్ష్మి, శాంతి, లక్ష్మి పాల్గొన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...