అండగా నిలవండి అభివృద్ధి చేస్తా


Wed,November 14, 2018 11:27 PM

ఆలేరురూరల్ : మరోసారి అండగా ఉండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆలేరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మంతపురి, శర్భానాపురం, గొలనుకొండ, తూర్పుగూడెం, శారాజీపేట వివిధ గ్రామాల్లో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి మహిళలు మంగళహారతులిచ్చి, బొట్టు పెట్టి స్వాగతం పలికారు. భారీ ర్యాలీ, కోలాటాలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్ల మధ్య ప్రచారం జరిగింది. దీంతో గ్రామాలు గులాబీమయంగా మారాయి. ఈ సందర్భంగా అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందాయని, ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారన్నారు.

అన్ని వర్గాలకు పెద్దపీట..
గౌడన్నలకు తాటీ పన్ను రద్ధు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. అంతేకాకుండా యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, రైతులకు సబ్సిడీపై పాడి గేదెలు, లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకం, చేపల పంపిణీ, కుల సంఘాల భవనాల నిర్మాణం ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నేతన్నల పరిస్థితి చూసి చలించిన కేసీఆర్ జోలే పట్టి ఆర్థికసాయం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ఆసరా, సాగు నీరు అందించేందుకు మిషన్ కాకతీయ, తాగునీటి కోసం మిషన్ భగీరథ, ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహకారం కోసం కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలను పారదర్శంగా అమలు చేసినట్లు తెలిపారు. ఈ పథకాలే ప్రజలను టీఆర్‌ఎస్‌కు ఓటేసేలా చేస్తాయన్నారు.

అన్నదాతకు అండగా..
గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులు కరెంట్ అడిగిన ప్రజలపై కాల్పులు జరిపి, గుర్రాలతో తొక్కించారన్నారు. టీఆర్‌ఎస్ రైతులు అడగకుండానే 24 గంటల ఉచిత కరెంట్ అందించిందన్నారు. నాడు కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతుల కండ్లలో కన్నీరు చూస్తే నేడు టీఆర్‌ఎస్ సుపరిపాలనలో రైతుల కండ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. వ్యవసాయం అంటే దండుగా అన్న దుస్థితి నుంచి.. పండుగ అన్న స్థితికి తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. ఆలేరు నియోజక వర్గానికి సాగు జలాలు రప్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అన్నదాత కష్టాలు తెలిసిన నేత కేసీఆర్ అని, మరోసారి టీఆర్‌ఎస్ పాలనను తీసుకురావడానికి రైతులు కృషి చేయాలని కోరారు.

ఆదరణ..
టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదన్నారు. ఆసరా పింఛన్లు, బీమా పెంపు, నిరుద్యోగభృతి వంటి అంశాలు మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై ఆయా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన కాంగ్రెసోళ్లకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు.. తాను ప్రచారం కోసం ఏ గ్రామానికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు వాటిని తిప్పికొడుతారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ క్యాసగల్ల అనసూయ, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, వైస్ ఎంపీపీ కిష్టయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోహన్‌రావు, మదర్ డెయిరీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, శ్రీశైలం, ఎంపీటీసీలు బాకీ ఆనంద్, రచ్చ కావ్యశ్రీ, మాజీ సర్పంచ్‌లు బక్క రాంప్రసాద్, మొగులగాని మల్లేశ్, గంగూల శ్రీనివాస్, రజినీరవిగౌడ్, ఉడుగుల రవి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు వట్టిపల్లి మల్లేశ్, కర్రె రాజు, గోవర్ధన్, శ్రీపతి భిక్షపతి, వెంకటేశ్, హరినాథ్, మహేందర్, సత్యనారాయణ, శోభన్‌బాబు, వెంటిక మధు, గంపల విజయ్, దేవేందర్‌నాయక్, జైరాంనాయక్, మండల నాయకులు మొరిగాడి వెంకటేశ్, బీజని మధు, పోరెడ్డి శ్రీనివాస్, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ, ఆడేపు బాలస్వామి, సరాబు సంతోశ్, ఎసిరెడ్డి మహేందర్‌రెడ్డి, కెమిడి సిద్ధేశ్వర్, పరిదె సంతోశ్,సంపత్, మధు తదితరులు పాల్గొన్నారు.

189
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...