మునుగోడులో నాలుగు నామినేషన్లు


Wed,November 14, 2018 11:26 PM

చండూరు, నమస్తే తెలంగాణ : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. చండూరు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తుండగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున ఆయన తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఆపార్టీ నాయకులతో కలిసి సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అబ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరుపున కాంగ్రెస్ నాయకులు కర్నాటి వెంకటేశం, దివంగత పాల్వాయి గోవర్ధ్దన్ రెడ్డి తనయుడు పాల్వాయి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బేరె వెంకటేశంలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలుచేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జెల్ల మార్కండేయ, మునగాల నారాయణరావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఎంపీపీ వెంకన్న, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగులవంచ నరేందర్‌రావు, బొమ్మరబోయిన వెంకన్న, కోడి వెంకన్న, పందుల భిక్షం, కళ్లెం సురేందర్ రెడ్డి, గోపిడి వెంకట్‌రెడ్డి, జనార్దన్, పాలకూరి రాములు, హరినాథరావు పాల్గొన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...