ఘనంగా బాలల దినోత్సవం


Wed,November 14, 2018 11:25 PM

అడ్డగూడూరు : బాలల దినోత్సవాన్ని వెల్దేవి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెచ్‌ఎం టి.నర్సింహామూర్తి మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయసిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

చౌటుప్పల్ రూరల్ : రెడ్డిబావి గ్రీన్‌గ్రోవ్ పాఠశాల, పంతంగి హైస్కూల్, కొయ్యలగూడెం ప్రగతి హైస్కూల్‌ల్లో బుధవారం బాలలదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో వివిధ వేషధారణలో విద్యార్థులు పలువురిని అలరించారు. ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పంతంగి హైస్కూల్ కార్యక్రమానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రొఫెసర్ డా.టి విజయ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. బి.అనిల్‌కుమార్ రెడ్డి, ఇండ్ల శ్రీనివాస్, బి.బాలరాజు, బర్రె శేఖర్‌ఎస్.సంధ్యారాణి, కె.జానకి, గీతారాణి, కె.మమత, బి.కవిత, ఎస్‌డీ సయ్యద్, ఎస్‌డీ షబ్బీర్, జి.యాదయ్య పాల్గొన్నారు.

సంస్థాన్‌నారాయణపురం : మాజీ ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం వేడుకలను బుధవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిపించారు. మండల కేంద్రంలోని కసూర్బాగాంధీ పాఠశాల, విద్యాసాగర్, మిలీనియం విద్యామందిర్, గ్రీన్‌గ్రోవ్ పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్య్రసమరయోధులుగా ప్రత్యేక వేషధారణతో అలరించారు. మిలీనియం పాఠశాలలో క్రీడల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో జరిగిన వేడుకలకు ఎంఈవో వెంకటేశ్వర్లు, మండల వైద్యాదికారి దీప్తి హజరైనారు. ఢిల్లీలో మహిళా డ్రైవర్‌గా పని చేస్తున్న సీత్యతండాకు చెందిన సరితను ఆదర్శంగా తీసుకొవాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి లేకుండా మానసికోల్ల్లాసం పొంద వచ్చన్నారు. ఈ సందర్భంగా 10 మంది విద్యార్థినుల క్లబ్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారి శివరంజని, లక్ష్మి, మిలీనియం పాఠశాల హెచ్‌ఎం మరియన్, విద్యాసాగర్ పాఠశాల హెచ్‌ఎం కట్ల భాస్కర్‌చారి పాల్గొన్నారు.

రామన్నపేట : ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సివిల్ కోర్డ్ న్యాయమూర్తి రాజేశ్‌కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా మదర్ థెరిసా హైస్కూల్‌లో న్యాయసేవా సదన్‌లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు చట్టం, న్యాయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మదర్ థెరిసా పాఠశాల వ్యవస్థాపకులు మార్టిన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హద్యల శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు సంగిశెట్టి బాలరాజు, బొడిగే లక్ష్మయ్య, అశోక్ కుమార్, యాదగిరి, వెంకటాచలపతి పాల్గొన్నారు.
రామన్నపేట : బాలల దినోత్సవాన్ని వివేకానంద హై స్కూల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నర్సరీ, ఎల్కేజీ విద్యార్థులు ఫ్యాన్సీ డ్రస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు తిరుగుడు మల్లికార్జున్ నెహ్రూ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కిరణ్మయి, ఉపాధ్యాయులు బాబు, నాగరాజు, స్వామి,

రామన్నపేటః కృష్ణవేణి టాలెంట్, మదర్ థెరిసా, డాన్‌బోస్కో, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి పాత బస్టాండు ఆవరణలోని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జె.మణి, యాజమాన్యం సభ్యులు జెల్లా వెంకటేశం, జానకి, గోపిశ్రీ, ఉమారాణి, ఆసియా, జుబేదా, మహాలక్ష్మి, సబిత, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...