రచ్చ రచ్చ


Tue,November 13, 2018 11:59 PM

-మహాకూటమిలో పెరుగుతున్న అసంతృప్తులు
-సొంతంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న నేతలు
-టీజేఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ టీపీఎస్ కన్వీనర్ కల్లూరి రామచంద్రారెడ్డి
-ఇండిపెండెంట్‌గా రంగంలోకి.. నామినేషన్ దాఖలు
-కాంగ్రెస్ నుంచి భిక్షమయ్యకు టికెట్ రావడంతో ఇతర నేతల కినుక
-రెబల్‌గా పోటీ చేస్తానంటున్న అసంతృప్త నేత చామల ఉదయ్‌చందర్‌రెడ్డి
యాదాద్రిభువనగిరిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మహాకూటమిలో టికెట్ల పంచాయితీ మరింత తీవ్రమయ్యింది. జిల్లాలోని అన్ని స్థానాల్లోని టికెట్లను కాంగ్రెస్ పార్టీకే కేటాయించడంతో మిగతా పార్టీ ఆశావాహుల్లో నిరాశే మిగిలింది. యాదాద్రిభువనగిరి జిల్లాలో కూడా రెండు సీట్లలో కాంగ్రెస్‌పోటీ చేస్తుండటం.. భాగస్వామ్య పార్టీలకు మొండి చేయి చూపడంతో మహాకూటమి నిప్పులకుంపటిలా రాజుకున్నది. భాగస్వామ్య పక్షాలకు జిల్లాలో ఎలాంటి ప్రాతినిథ్యం లేకుండా చేయడంతో ఆ పార్టీల నుంచి టికెట్లు ఆశించిన వారు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగేందుకు సమయత్తమయ్యారు. జిల్లాలో ఆలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌కు తిరిగి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో మిగతా నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓసీ విభాగం నుంచి టికెట్‌ను ఆశించిన చామల ఉదయ్‌చందర్‌రెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. టీజేఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి సైతం ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతానని స్పష్టం చేయడంతో మంగళవారం నామినేషన్ దాఖాలు చేశారు.

నామినేషన్ల ప్రకియ ప్రారంభమైన వేళ..
కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల పంపకంపై అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై ఆ పార్టీ ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇతర పార్టీలకు టికెట్ కేటాయించకపోవడంతో మహాకూటమి నిప్పుల కుంపటిలా రాజుకున్నది. మహాకూటమిపై కాంగ్రెస్ అదిష్టానం తీరుపై కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. భాగస్వామ్య పక్షాలకు జిల్లాలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా చేడయంతో ఆ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించిన వారు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు సమయత్తమవుతున్నారు.

కూటమి నిర్ణయం బేఖాతర్..
ఇండిపెండెంట్‌గా కల్లూరి నామినేషన్ దాఖాలు..
మహాకూటమిపై పెరిగిన అసంతృప్తితో పలువురు నేతలు ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారు. టీజేఎస్‌లో చేరి టిక్కెట్ ఆశించిన కల్లూరి రామచంద్రారెడ్డికి మహాకూటమి ఇచ్చిన షాక్‌తో భంగపడి, అంతలోనే కూటమినిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ మంగళవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖాలు చేయడం సంచలనం కలిగిస్తున్నది. టీజేఎస్ నేత కోదండరాం ఇచ్చిన షాక్‌తో కల్లూరి రామచంద్రారెడ్డి మహాకూటమికి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖాలు చేయడంతో ఆలేరులో మహాకూటమి రాజకీయాలు ఒక్కసారి వేడేక్కాయి. మరోవైపు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్లు ఆశించిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌కు తిరిగి కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశిస్సులతో టిక్కెట్ ఖరారు చేయడంతో తమ తోవ తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఆది నుంచి నియోజక వర్గంలో కష్టించి పనిచేస్తున్న తమకు మొండిచేయి మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలేరు ఓసీ సీటూ.. అలాంటప్పుడు ఓసీలకే టిక్కెట్ ఇవ్వాలి. బీసీ నాయకుడైన భిక్షమయ్యగౌడ్‌కు టిక్కెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓసీ విభాగం నుంచి టిక్కెట్ ఆశించిన చామల ఉదయ్ చందర్‌రెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బీసీలలో మాలో ఒకరికి సీటు ఇవ్వాలని మొదటి ఉంచి కాంగ్రెస్ జెండా మోసిన కొంత మంది బీసీలంతా కోరినా ఫలితం లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే గత కొన్నేండ్లుగా ఆలేరు నియోజకవర్గంలో ఎం తో ఖర్చుపెట్టారు. ప్రజా సంక్షేమ కోసం ఎంతో పనిచేశా.. కూటమి పేరుతో ఆలేరు సీటును వదులుకునేది లేదని, ఇండిపెండెంట్‌గానైనా రంగంలోకి ది గేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తో దీటుగా ఆలేరు పట్టణంలో 10వేల మం దితో భారీ బహిరంగసభను పెట్టాను. ఆదే స్ఫూ ర్తితో ముందుకు సాగుతానని కుండ బద్దలు కొట్టినట్లు కల్లూరి చెబుతున్నారు. కాంగ్రెస్ సీటు ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణ పరిరక్షణ వేదిక పేరుతో ఇన్నాళ్లు కష్టించి పనిచేసిన తాను ఒకరి కోసం ఊరుకునేది లేదని తేగేసి చెబుతున్నారు.

భువనగిరిలో కాంగ్రెస్ పంచాయితీ..
భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయితీ నివురుగప్పిన నిప్పులా రాజుకుంటుంది. భువనగిరి కాంగ్రెస్‌లో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ ఖరారు కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఒక్కసారి అసమ్మతి తారాస్థాయికి చేరింది. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తే ప్రత్యర్థి పార్టీలకు విజయం సులువతుందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ప్రచారం చేసేందుకు మొఖం చాటేస్తున్నారు. భువనగిరిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటారని, బీసీ నాయకులకు టిక్కెట్ ఇస్తే గెలుపు సులువతుందని చెప్పినా నిరాసే మిగిలిందని బాధపడుతున్నారు. భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, గర్దాసు బాలయ్య, తంగళపల్లి రవికుమార్, అందెల లింగయ్యయాదవ్‌తో పాటు మరి కొంత మంది నాయకులు ఢిల్లీలో మకాం వేసినా రెడ్డికూటమి నుంచి కాంగ్రెస్‌ను రక్షించండి అంటూ తెలిసిన ప్రతి నాయకుడికి వినతిపత్రాలు అందిస్తున్న నేపథ్యంలో టిక్కెట్ ఖరారు అయిందని ఖుషీగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి పరేషాన్‌లో పడ్డారు.

జిల్లాలో రెండు స్థానాలు కాంగ్రెస్ వే..
మహాకూటమిలో విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రెండు సీట్లు కాంగ్రెస్ నాయకులకే ఇవ్వడంతో మిగతా పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మహాకూటమిలో ఉన్నామని చెప్పుకుంటున్న టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క సీటు కూడా లభించలేదు. ఈ పరిస్థితుల్లో కొంత మంది నేతలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యువనేత, గతంలో కాంగ్రెస్ తరపున పలువురు నాయకులు పోటీ పడినా ఫలితం లేకుం డా పోయింది. ఆలేరు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ పేరు ఖరారు కావడంతో కాంగ్రెస్‌లో అసమ్మతి కుంపటి రాజుకుంటున్నది. మహాకూటమి నుంచి టిక్కెట్ ఆశించిన టీడీపీ మహిళావిభాగం అ ధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టీపీఎస్ రాష్ట్ర కన్వీనర్ కల్లూరి రామచంద్రారెడ్డికి నిరాశే మిగలడంతో ఇండిపెండెంట్‌గా వారు రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఒకరికి కంటే మరొకరు పోటీలతో సమావేశాలు, ప్రచారాలు చేసినా మహాకూటమి మోసం చేసిందంటూ బోరుమంటున్నారు.

టీఆర్‌ఎస్‌కు అనుకూలం..
మహాకూటమి అల్లకల్లోలం కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థ్ధుల గెలుపుకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల అభ్యర్థులు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నామినేషన్ దాఖాలు చేశారు. భారీ మెజార్టీపై వారు దృష్టి సారించారు. రెండో దఫా ప్రచారం ముగించుకుని ముడోవ దఫా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కుమ్ములాటలు, మహాకూటమిలో జరిగిన అవమానంతో పలువురు నేతలు ప్రచారానికి దూరంగా ఉండటం వంటి పరిణామాలు టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా మారనున్నాయి.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...