కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి


Tue,November 13, 2018 11:55 PM

తుర్కపల్లి : టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాదించిందని ఆలేరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెద్ద తండాకు చెందిన మాజీ ఉప సర్పంచ్ భానోత్ దేవ్‌నాయక్, పానుగోతు సైదులు, నందు, చందు, బోజ్య, బిచ్చు, కపుర, పంతు, అంబులతో పాటు 50 మంది వివిధ పార్టీల కార్యకర్తలను మంగళవారం యాదగిరిగుట్టలోని ఆమె నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, నాయకులు ర్యాకల రమేశ్ యాదవ్, మెతీలాల్, వినోద్ నాయక్, సోమ్ల, రాజు, హచ్చ, తదితరులున్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...