అభివృద్ధికి అండగా నిలబడండి


Tue,November 13, 2018 11:54 PM

-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి సతీమణి వనిత
వలిగొండ : అభివృద్ధికి అండగా నిలబడాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి సతీమణి వనిత అన్నారు. టీఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి పైళ్ల శేఖర్‌రెడ్డి శ్రమించారన్నారు. అంతకుముందు ఆమె స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు బద్దం భాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాలుగౌడ్, ఆత్మ చైర్మన్ గంగాధరి రాములు, ఎం పీటీసీ అయిటిపాముల జ్యోతి, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ మమత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రత్నయ్య, పట్టణ కమిటీ అధ్యక్షుడు అయిటిపాముల ప్రభాకర్, నాయకులు భిక్షపతి, లక్ష్మయ్య పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...