సీఎం కేసీఆర్ వెన్నంటే యువత


Tue,November 13, 2018 11:54 PM

-మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
భువనగిరి టౌన్ : సీఎం కేసీఆర్ వెన్నంటే యువత ఉందని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. 15 మంది సాప్ట్‌వేర్ ఉద్యోగులు, 100 మంది యువకులతో కలిసి యువ టీం కన్వీనర్ సూదగాని రాజు టీఆర్‌ఎస్ భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరంమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 60 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగున్నరేండ్ల్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. ఒక వైపు సంక్షేమ పథకాలు, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు. టీఎస్ ఐపాస్ ఏర్పాటుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి ప్రైవేట్ పరిశ్రమలు వచ్చాయన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనను మెరుగుపర్చామన్నారు. అంతకుముందు యువ టీం కన్వీనర్ సూదగాని రాజు మాజీ మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...