నేటి నుంచి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి


Tue,November 13, 2018 11:54 PM

-ప్రచార షెడ్యూల్ విడుదల
యాదాద్రిభువనగిరిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. నామినేషన్ దాఖాలు చేసిన అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రెండు రోజులు కేటాయించి ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించే పనిలో పడ్డారు. ఇప్పటికే మొదటి దఫా ప్రచారం పూర్తి చేసుకున్న ఆమె క్షేత్రస్థాయి ప్రచారం చేసేందుకు సన్నద్దమయ్యారు. బుధవారం ఆలేరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు బహదూర్‌పేట, 8.30 లకు మంతపూరి, 9.30లకు శర్భనాపురం, 10.30లకు గోలన్‌కొండ, 12.30లకు శారాజీపేట, 1 గంటకు టంగుటూరు, 2 గంటలకు కొల్లూరులో ప్రచారం సాగించనున్నారు. అనంతరం భోజన విరామం తరువాత 3 గంటలకు మందనపల్లి, మధ్యాహ్నం 3.30 గంటలకు సాయిగూడెం, 4 గంటలకు సోమరాజ్‌గూడెం, సాయంత్రం 4.40 లకు శ్రీనివాసాపురం, 5 గంటలకు పటెల్‌గూడెం, 6 గంటలకు శివలాల్‌తండా, 7 గంటలకు గుండ్లగూడెం, సాయంత్రం 9.30 గంటలకు కందిగడ్డతండాలో ప్రచారం ముగించనున్నారు. అలాగే గురువారం(15.11.18) రోజు ఉదయం 8 గంటలకు బైరాంనగర్, 9 గంటలకు రాజానగర్, 10 గంటలకు రాఘవపురం, 11 గంటలకు కొలనుపాక అనంతరం భోజన విరామం అనంతరం సాయంత్రం 3 గంటల నుంచి 9.30 గంటల వరకు ఆలేరు పట్టణంలో ప్రచారం కొనసాగించనున్నారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...