కారు గుర్తుకు ఓటేయాలి


Sun,November 11, 2018 11:43 PM

చౌటుప్పల్ రూరల్ : మునుగోడు మరింత అభివృద్ధి సాధించాలంటే కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించాలని టీఆర్‌ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పీపల్‌పహాడ్, ఎనగంటితండా, అల్లాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్ల్లి ఓట్లు అభ్యర్థించగా.. గ్రామస్తులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. తిరిగి అధికారంలో వస్తే ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే నియోజకవర్గంలో చర్లగూడెం, లకా్ష్మపురం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందన్నారు. అంతేకాకుండా రాచకొండ రిజర్వాయర్ ఏర్పాటు చేసి తంగడపల్లి, దేవలమ్మనాగారం చెరువులకు కృష్ణాజలాలను తరలించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత అభివృద్ధిని టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ప్రగతిని బేరీజు వేసుకోని కారు గుర్తుకు ఓటేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. కల్యాణలక్ష్మి, రైతు బీమా, రైతుబంధు, ఆసరా పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ తదితర పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. సమైక్యాంధ్ర పాలకుల హయాంలో రాంకీ సంస్థతో అంతర్గత ఒప్పదం చేసుకొని దండు మల్కాపురంలో చెత్త డంపింగ్‌యార్డ్ తేవడానికి ప్రయత్నించారన్నారు.

దానిని ఉద్యమ నాయకుడిగా అడ్డుకున్నానన్నారు. దీనిపై అప్పటి మంత్రిని ప్రశ్నిస్తే ఎకరాకు రూ.6లక్షలు రైతులకు వస్తాయని, వాటితో ఇండ్లు కట్టుకోవాలని, పిల్లల వివాహం చేయాలని ఉచిత సలహ ఇచ్చారన్నారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేస్తుందన్నారు. నైపుణ్యం లేని కార్మికులు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నదన్నారు. ప్రజలు అడుగకుండానే పిలాయి పల్లి కాల్వ పెండింగ్ పనులకు రూ.150 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు రేవతీశ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొత్త పర్వతాలు యాదవ్, జిల్లా సభ్యులు చింతల దామోదర్‌రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశంగౌడ్, మాజీ సర్పంచ్‌లు సుర్వి మల్లేశంగౌడ్, వర్కాల మహేందర్‌గౌడ్, బొడ్డు రాజేశ్వరీ, నాయకులు గుండెబోయిన ఆయోధ్యయాదవ్, చెన్నగోని అంజయ్యగౌడ్, ఎడ్ల మహేందర్‌రెడ్డి, గుండెబోయిన వెంకటేశంయాదవ్, నందగిరి శ్యాంగౌడ్, వరకాంతం జంగారెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీరమళ్ల సత్తయ్యగౌడ్, బొడిగే బాలకృష్ణాగౌడ్, కొన్‌రెడ్డి జగాల్, రోషనగాని అశోక్‌గౌడ్, మెట్టు మహేశ్వర్‌రెడ్డి, దోసపాటి జంగయ్యగౌడ్, కరంటోతు భాస్కర్ నాయక్, బొడ్డు గాలయ్య పాల్గొన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...