మహాకూటమిని నమ్మొద్దు


Sun,November 11, 2018 11:43 PM

- టీఆర్‌ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వీరేశం
- ఇంద్రపాలనగరంలో ప్రచారం
రామన్నపేట : మహాకూటమి మాయా మాటలు నమ్మొద్దని టీఆర్‌ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. ఆదివారం మండలంలోని ఇంద్రపాలనగరంలో మాజీ సర్పంచ్ పూస బాలనర్సింహ ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వీరాంజనేయ, గంగమ్మ దేవాలయంలో పూజలు చేశారు. గొల్లకుర్మలు డప్పు కొడుతూ స్వాగతం పలికారు. గొర్రె పిల్లను బహూకరించారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం ఆయన సమక్షంలో ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, నాయకులు రాజిరెడ్డి, పూస బాలకిషన్, ముక్కాముల దుర్గయ్య, తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, గుత్తా నర్సిరెడ్డి, బత్తుల కృష్ణ, బల్తూ నాగయ్య, ఎడ్ల నరేందర్‌రెడ్డి, రవి, మధుబాబు, పున్న వెంకటేశం, పబ్బు రమేశ్, పెద్దగోని వెంకటేశం, మల్లం మల్లయ్య, కేస కిరణ్, సాల్వేరు లింగం, పోషబోయిన మల్లేశం, జెట్టి బాల మల్లయ్య, శ్రవణ్, వనం విఠల్, అంతటి రమేశ్, బొడ్డుపల్లి లింగయ్య, శివప్రసాద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...