రైతులు టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలి


Sun,November 11, 2018 11:40 PM

ఆత్మకూరు(ఎం) : రైతు సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ.4వేలను పెట్టుబడిసాయం కింద అందివ్వడంతో పాటు రైతు బీమాను ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్‌కు రైతులు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రైతులందరూ రాజులెక్క బతుకుతారన్నారు. ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, స్థానిక మాజీ సర్పంచ్ బీసు చందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్లు కోరె భిక్షపతి, బీసు ధనలక్ష్మి, ఎంపీటీసీ బాల్‌నర్సయ్య, వివిధ గ్రామాల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు నాతి రాజు, యశ్వంత్, శ్రీశైలం, అంజిరెడ్డి, రవి, శ్రీను, భారతమ్మ, రాజయ్య పాల్గొన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...