సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష


Sat,November 10, 2018 11:53 PM

బొమ్మలరామారం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని, మరోసారి గెలువడం ఖాయమని టీఆర్‌ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పక్కీర్‌గూడెం, మేడిపల్లి, మైలారం, నాగినేనిపల్లి, బొమ్మలరామారం, సోలిపేట, బోయిన్‌పల్లి, తిమ్మాపూర్, చీకటిమామిడి, కంచల్‌తండా, మాచన్‌పల్లి, చౌదర్‌పల్లి, మర్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆలేరుకు పుష్కలంగా సాగు, తాగు నీరు అందాలంటే మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలన్నారు. అత్యధిక నిధులతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. గ్రామాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ బొమ్మలరామారం మండలానికి హెచ్‌ఎండీఏ నిధులు రూ.5కోట్ల 70లక్షలతో పనులు కేటాయించామన్నారు.

పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావాలంటే మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రంలో ఎంపీపీ బొల్లంపల్లి తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ కూకుట్ల శ్రీశైలం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గూదె బాల్‌నర్సింహ, ప్రధాన కార్యదర్శులు వేముల సురేందర్‌రెడ్డి, కుర్మిళ్ల దామోదర్‌గౌడ్, ధీరావత్ రాజన్‌నాయక్, ఉపాధ్యక్షులు రామిడి రాంరెడ్డి, బొల్లంపల్లి జైపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వరిగంటి సతీశ్‌గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్నె శ్రీధర్, సీనియర్ నాయకుడు మర్రి కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు మేడబోయిన శశికళ, గుండ్లపల్లి నీలిమ, సందెగల్ల ఇందిరా, మాడోత్ లక్ష్మీశంకర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చిమ్ముల సుధీర్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్లు మూగల మహేందర్‌రెడ్డి, చీరిక హేమలత, నాయకులు పెద్దిరెడ్డి మల్లారెడ్డి, వాంకుడోత్ రాములునాయక్, గూడ సింహారెడ్డి, పసుల వెంకటేశ్, తుంగని భాష, పాండునాయక్, బోయిని నర్సింహ, మల్లేశ్, చిన్నశంకరయ్య, పైళ్ల లకా్ష్మరెడ్డి, ముడుగుల దాసు, మోటె రమేశ్, ఆనంద్‌గౌడ్, బాల్‌రెడ్డి, యూత్ అధ్యక్షులు బుడుమ వెంకటేశ్, మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బుడుమ సురేశ్, బట్కీర్ బీరప్ప, సాయిరెడ్డి, ఇప్పలపల్లి నరేందర్, రేసు రాంరెడ్డి, కుశంగల సత్యనారాయణ, గోపాల్, బండి మహేశ్‌గౌడ్, సత్యనారాయణ, నాయిని బాల్‌నర్సింహ, శ్రీరాములు, రాములు, గణేశ్, కృష్ణ, మాజీ సర్పంచ్‌లు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, పద్మారెడ్డి, కూర వెంకటేశ్, పొట్ట కృష్ణ, ధీరావత్ శంకర్‌నాయక్, రాజిరెడ్డి, పుడూరి బాల్‌నర్సింహ, ఆంజనేయులుగౌడ్, టీఆర్‌ఎస్వీ నాయకులు బాల్‌సింగ్, రాజ్‌కుమార్‌నాయక్, సుమన్, శేఖర్, మోతీరాం తదితరులు పాల్గొన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...