గులాబీ జోష్


Fri,November 9, 2018 11:43 PM

-ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు
-భువనగిరి, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారం
-బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
-కారు గుర్తుకే ఓటు వేస్తామంటున్న జనం
భువనగిరిరూరల్ : కారు జోరు కొనసాగుతున్నది. జిల్లాలో మరోసారి టీఆర్‌ఎస్‌పార్టీకే పట్టం కట్టేందుకు ప్రజలు జై కొడుతున్నారు. ప్రచారానికి వస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు స్వాగతం పలుకుతూ తమ ఓటు కారు గుర్తుకేనని ప్రకటిస్త్తున్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని రామకృష్ణాపురం, పెంచికల్‌పహాడ్, రామచంద్రాపురం, చందుపట్ల, వీరవెళ్లి, బండసోమారం, గౌస్‌నగర్, యర్రంబల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరోవైపు సంస్థాన్‌నారాయణపురం మండలంలోని పుట్టపాక, మల్లారెడ్డిగూడెం, గుజ్జ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణాపురం, పెంచికల్‌పహాడ్, రామచంద్రాపురం, చందుపట్ల, వీరవెళ్లి, బండసోమారం, గౌస్‌నగర్, యర్రంబల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర శ్రమ ఒక్కటే కారణమన్నారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ గ్రామాలు ఎడారులుగా మారాయని గుర్తు చేశారు. గ్రామాల్లో ఎన్నడూ లేని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వపరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

గతంలో ప్రభుత్వ పథకాలంటేనే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అందేవని, సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, పీఏసీఎస్ చెర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణగౌడ్, సుబ్బూరు బీరుమల్లయ్య, కేశవపట్న రమేశ్, రైతు సమన్వయ సమతి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జనగాం పాండు, అబ్బగాని వెంకట్‌గౌడ్, చిందం మల్లిఖార్జున్, సిల్వేరుయేసు, కంకల కిష్టయ్య, చందుపట్ల రాజేశ్వర్‌రావ్, సింగిరెడ్డి నర్సిరెడ్డి, పుట్ట వీరేశ్‌యాదవ్, మట్ట ధనుంజయగౌడ్, దుర్గపతి చంద్రమ్మ, బొక్క కొండల్‌రెడ్డి, భూక్యా భాస్కర్‌నాయక్, ఒగ్గు శివకుమార్, జక్కి నగేశ్, అంకర్ల మురళీ, జమ్ముల రమేశ్, బీరప్ప, చింతల ఆంజనేయులు, గుజ్జ పవన్, సిల్వేరు మధు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...