యాదాద్రిలో భక్తుల సందడి


Fri,November 9, 2018 12:17 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య పూజల కోలాహలం నెలకొన్నది. గురువారం వేకువజామునకే స్వయంభువులు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. బాలాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు.

రూ. 100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సామూహిక శ్రీసత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. వ్రతాల ద్వారా రూ.47,000ల ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో ఆలయ ఏఈవో వేముల రామ్మోహన్‌రావు, పర్యవేక్షకులు గజ్వేల్ రఘు, సండ్ర మల్లేశ్, వేదాంతం శ్రీకాంత్, సింహ పాల్గొన్నారు.

శ్రీవారి ఖజానాకు రూ. 17, 26, 747 ఆదాయం..
శ్రీవారి ఖజానాకు రూ. 17, 26, 747 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 36, 676, 100 రూపాయల టికెట్‌తో రూ. 37, 500, కల్యాణకట్ట ద్వారా రూ. 13,000, గదులు విచారణ శాఖతో రూ. 24, 900, ప్రసాదవిక్రయాలతో రూ. 3, 10, 600, అన్నప్రసాదంతో 1, 08, 881శాశ్వత పూజల ద్వారా రూ. 26, 080 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

2019 క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి 2019 క్యాలెండర్‌ను యాదాద్రి ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలు దీపావళి పర్వదినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. రెండునెలల ముందుగానే క్యాలెండర్లను విక్రయిచే విధంగా చర్యలు తీసుకోవడంతో త్వరగా ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు. రూ.15, రూ.100 క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. లక్ష్మీపూజలు నిర్వహించి సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. దీపావళి సందర్భంగా పటాలకులను శ్రీవారి సన్నిధిలో కాల్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...