మతిభ్రమించి మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి


Fri,November 9, 2018 12:17 AM

సంస్థాన్‌నారాయణపురం : మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుకాయమని తెలిసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కరంటోతు జగ్రాంనాయక్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యాయలంలో గురువారం ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యక్తిగతంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మీడియా ముందు విమర్శించి నీ ఓటమిని నీవు అంగీకరించావన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న యవకులను తాగుబోతులుగా మార్చి మాట్లడటం వల్ల వారి మనోభావాలను దెబ్బతీయడం ఎంవరకు సమంజసం అని అన్నారు. నీ వద్ద డబ్బుందన్న అహంకారంతో ఎది మాట్లాడిన, ఎం చేసినా చెల్లుతుందని అనుకోవడం అవివేకం అవతుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా భరిలో ఉన్న కూసుకుంట్ల గురించి తప్పుగా రాసి తన మీద మంచిగా రాయాలని మీడియాకు చెప్పడంతోనే నీ అహంకారం ఏమిటో తెలుస్తున్నదని ఆవేశంతో అన్నారు. ఎన్ని కుట్రలను చేసినా ప్రజల మనసుల గూడుకట్టుకున్న కేసీఆర్‌ను చెరపలేరని తెలిపారు. గతంలో ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తూ ఎక్కడ కూడా అభివృద్దికి రూపాయికూడా ఖర్చుపెట్టనివాళ్ళు ఇప్పడు మళ్లీ ఎమ్మెల్యే కావాలని పదవీవ్యామోహం తప్ప చేసేదికూడా ఎమిలేదని పేర్కొన్నారు.

ఎన్నిలకప్పుడు మాత్రమే అందరిని పేర్లు తెలుసుకొని పలకరించడం జరుగుతుందని ఎన్నికల తర్వాత ఎన్నిసార్లు కలిసినా కనీసం గుర్తుకూడా పట్టనివారు ఈ నియోజకవర్గంలో అవసరం లేదని అన్నారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి, ఈ నియోజకవర్గం గురించి పూర్తిగా అవగాహన ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ప్రజలు గెలించబోతున్నారని ఆశాభశం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని అన్నారు. అనంతరం వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజగోపాల్‌రెడ్డి దిష్టి బొమ్మను మండల కేంద్రంలో దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కూసుకుంట్ల సత్తిరెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు కొప్పుసత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మన్నె ఇంద్రసేనారెడ్డి, చిలువేరు భిక్షపతి, జిల్లా విజిలెన్సు డైరెక్టరు పానుగోతు బాలునాయక్, జక్కిడి ధన్వంతరెడ్డి, ప్రముఖ్‌రెడ్డి, నలపరాజు నర్సింహ, యువజన విభాగం మండలాధ్యక్షుడు రాచకొండ గిరి, టీఆర్‌ఎస్వీ నాయకులు నలపరాజు రమేశ్, కడ్తాల కృష్ణ, గడ్డం స్వామి, ఎర్పుల లింగస్వామి, బంగారు వెంకటేశం, చెరుకు నరేశ్, షేక్‌పాషా, మధు, మహేశ్, రామకృష్ణ, రాజేశ్, లడ్డు పాల్గొన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బొడ్డు రేవతీశ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి మతిభ్రమించి పిచ్చికూతలు కూస్తున్నాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు డీఆర్ రాము, చంద్రగిరి సంపత్, మెట్టు మహేశ్వర్‌రెడ్డి, మర్రి మహేందర్‌రెడ్డి, రామలింగం, నవీన్, నరేష్, దబ్బటి రాములుగౌడ్, కొప్పు సంతోష్,శ్రావణ్‌కుమార్, శ్రీకాంత్ , నరేశ్ పాల్గొన్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...